మహేందరెడ్డితోనే తాండూరు అభివృద్ధి
– ఎమ్మెల్సీని వేరువేరుగా కలిసిన టీఆర్ఎస్ నేతలు
తాండూరు/పెద్దేముల్, దర్శిని ప్రతినిధి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డితోనే తాండూరు నియోజకవర్గ అభివృద్ధి సాధ్యపడుతుందని నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహేందర్ రెడ్డి రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నిక కావడంపై నియోజకవర్గంలోని తాండూరు, పెద్దేముల్ మండల నాయకులు వేరు వేరుగా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
తాండూరు మండలం నుంచి డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, పెద్దేముల్ మండలం నుంచి జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ గాజీపూర్ నారాయణరెడ్డిల ఆధ్వర్యంలో పలువురు నాయకులు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేసే అవకాశం ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో మహేందర్‌రెడ్డికి అవకాశం దక్కిందని అభిప్రాయపడ్డారు. మహేందర్ రెడ్డి నాయకత్వంలో తాండూరు అభివృద్ధి సాద్యమవుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని కలిసిన వారిలో తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, పెద్దేముల్ సొసైటీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి. పెద్దేముల్ మండల్ సర్పంచుల సంఘం అధ్యక్షుడు బల్వంత్ రెడ్డి, రేగోండి సర్పంచ్ హైదర్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు నారాయణరెడ్డి, మాజీ సర్పంచ్ రామచందర్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు నారాయణ రెడ్డి, డివై నర్సములు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు సంజీవరెడ్డి, అంజిల్ రెడ్డి, తాండూరు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు మేఘనాథ్ గౌడ్, సర్పంచ్ లాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్ ఇస్మాయిల్, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, రాంచెందర్, రాజుగౌడ్, అంబరీష్, అమీద్, శ్రీశైలం, భీంరెడ్డి తదితరులు ఉన్నారు.


