బల్దియా ఫైట్ లో ఫస్ట్ నామినేషన్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

బల్దియా ఫైట్ లో ఫస్ట్ నామినేషన్..!
– బీఆర్ఎస్ నుంచి పట్లోళ్ల నర్సింలు దాఖలు
– గులాబీ జెండా ఎగరేస్తామన్న నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల పర్వ మొదలైంది. పుర పోరులో బీఆర్ఎస్ పార్టీ నుంచి మొదటి నామినేషన్ దాఖలు అయ్యింది.

పార్టీ చైర్మన్ అభ్యర్థి పట్లోళ్ల నర్సింలు మొదటి నామినేషన్ వేశారు. అంతకు ముందు పట్లోళ్ల నర్సింలు మున్సిపల్ ఎన్నికల ఇంచార్జీ శ్రీశైల్ రెడ్డి, సీనియర్ నాయకులు విఠల్ రెడ్డి, మాజీ లైబ్రరీ చైర్మన్ రాజు గౌడ్, శ్రీనివాస్ చారి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పట్లోళ్ల దీప నర్సింలు, మాజీ కౌన్సిలర్ సావిత్రమ్మలతో కలిసి మున్సిపల్ కు పుల్ జోష్ తో తరలి వచ్చారు. పట్టణంలోనీ 10వ వార్డు నుంచి నామినేషన్ దాఖలు చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలలో గులాబీ జెండా ఎగరేస్తామని అన్నారు. పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి ఉందని అన్నారు. పట్టణంలో 36 వార్డుల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని చైర్మన్ పీఠం కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. 15రోజుల్లో మున్సిపల్ పై గులాబీ జెండా ఎగరేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

 

కేసులు పెట్టడం హేయం..!