భగ్గుమన్న బీఆర్ఎస్..!
– కేసీఆర్‌కు సిట్ నోటీసులపై ఆగ్రహం
– నినాదాలతో దద్దరిల్లిన ఇందిరా చౌరస్తా
– కాంగ్రెస్ కక్షపై మండిపడిన పైలెట్ రోహిత్ రెడ్డి
-భారీ ఎత్తున పాల్గొన్న బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు
– నల్ల బ్యాడ్జీలు, జెండాలతో నిరసన, మానవహారం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం, సిట్ అధికారుల తీరును నిరసిస్తూ తాండూరు బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. ఆదివారం తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

రోహిత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు ప్రాంతాల నుంచి పట్టణంలోని ఇందిరా చౌరస్తా వద్దకు చేరుకున్నారు. నల్ల దుస్తులు, నల్ల జెండా, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. మానవహారం ప్రదర్శిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతి రేకంగా నినాదాలు చేశారు. గులాబీ నేతల నినాదాలతో ఇందిరా చౌరస్తా దద్దరిల్లింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వ కక్ష్య పూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. సిట్ అధికారులు సీఎం రేవంత్ రెడ్డి చేతిలో కీలు బొమ్మల్లా మారిపోయారని విమర్శించారు. ఎన్ని కుట్రలను చేసినా భయపడేది లేదని అన్నారు. కేసీఆర్ ను ఎవ్వరు భయపెట్టరలేరని అన్నారు.. కాంగ్రెస్ పార్టీకి రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు శ్రీనివాస్ చారి, వెంకట్ రెడ్డి, అబ్దుల్ సలీం, మాజీ వైస్ చైర్మన్ ఆసిఫ్, మాజీ కౌన్సిలర్లు అనురాథ, పరిమళ రవీందర్, ఈర్షాద్, సంతోష్ గౌడ్, ఇంతియాజ్, రాజన్ గౌడ్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

