ప్రజల ఆశీస్సులు హస్తానికే..!
– సర్కారు సంక్షేమ పథకాలే ప్రచార అస్త్రాలు
– పార్టీ కోసం పనిచేసిన కౌన్సిలర్లకే బీఫారాలు
– చివరి ఓటు బ్యాలెట్ బాక్సులో పడే వరకు కష్టపడండి
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల ప్రకటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులు హస్తం పార్టీకే ఉన్నాయని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం తీసుకోవాల్సిన జాగ్రతలు, చర్యలపై దిశా నిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసే నేతలు. కష్టపడిన కార్యకర్తలకే కౌన్సిలర్లుగా పోటీ చేసే అవకాశం కల్పించడం జరిగిందన్నారు. సామాజిక న్యాయం పాటిస్తూ బీసీలకు 15 సీట్లు, మైనార్టీలకు 9 సీట్లు, ముదిరాజ్ సామాజిక వర్గానికి 5 సీట్లు, కుర్వ సామాజిక వర్గానికి 1, గౌడ సామాజిక వర్గానికి 1, బ్రాహ్మణ సమాజంకు 1, వైశ్యులకు 1, వీరశైవులకు 4, ఎస్టీ సామాజిక వర్గానికి 1, ఎస్సీ సామాజిక వర్గానికి 3, ఉప్పరి సామాజిక వర్గానికి 1, మున్నూరు కాపు వర్గానికి 3, రెడ్డి సామాజిక వర్గానికి 1 సీటు కేటాయించడం జరిగిందని వివరించారు.

పోటీ చేసే అభ్యర్థులు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధినే ప్రచార అస్త్రాలుగా మార్చుకుని ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. రెండేళ్ల ప్రజా పాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అమలు చేసిన పథకాలను వివరించాలని అన్నారు. చివరి ఓటు బ్యాలెట్ బాక్సులో పడేంత వరకు కష్టపడాలని అన్నారు. ప్రతిపక్షాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ఎన్నికల్లో గెలిచి బుద్ధిచెప్పేవిధంగా ముందుకు సాగాలన్నారు. ఎన్నికల్లో 30 స్థానాలను గెలిచేది పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థులు, పార్టీ ఇంచార్జ్ లతో సమన్వయంతో ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్, మున్సిపల్ ఎన్నికల పరిశీలకులు నరేందర్ రాంశెట్టి, కోఆర్డినేటర్స్ ఇప్తాకర్, అశోక్ కుమార్, పట్టణ అధ్యక్షులు హబీబ్ లాల. వార్డు ఇంచార్జ్లు, అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులు వీళ్లే..
1వ వార్డు మిట్టి లలిత మహేష్, 2వ వార్డు ప్రత్యూష మజ్దేవి, 3వ వార్డు తాయాబా సుల్తానా, 4వ వార్డు షేక్ మెహెర్ ఉన్నీసా భేగం, 5వ వార్డు తన్వీర్ సుల్తానా, 6వ వార్డు బోయ రవిరాజు, 7వ వార్డు రొయ్యల నాగరాజు, 8వ వార్డు సాయప్ప, 9వ వార్డు పట్లోళ్ల చైతన్య ప్రశాంత్, 10వ వార్డు అల్లాపూర్ శ్రీకాంత్, 11వ వార్డు బంటు వేణుగోపాల్, 12వ వార్డు పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, 13వ వార్డు జాదవ్ రాములు, 14వ వార్డు మహియ అంజుమ్, 15వ వార్డు దివిటి ఎల్లప్ప, 16వ వార్డు నారా శ్రీలత, 17వ వార్డు సన తబస్సుమ్. 18వ వార్డు గౌరీ రాములు, 19వ వార్డు జుంటుపల్లి వెంకట్, 20వ వార్డు బీడ్కర్ జ్యోతి, 21వ వార్డు సబా ఫాతిమా, 22వ వార్డు మున్నాపురం రాము, 23వ వార్డు దొరశెట్టి సత్యమూర్తి, 24వ వార్డు బాలకృష్ణారెడ్డి, 25వ వార్డు రోయ్యల మధుబాల, 26వ వార్డు వైశాలి గౌడ్, 27వ వార్డు ఉప్పరి స్వరూప మల్లేశం, 28వ వార్డు మేడి విజయ్ భాస్కర్, 29వ వార్డు అబ్దుల్ రజాక్, 30వ వార్డు మెహరాజ్ భేగం, 31వ వార్డు మ హేష్ సింగ్ ఠాకూర్, 32వ వార్డు శిల్ప పటేల్, 33వ వార్డు ప్రహాల్లాద్ కులకర్ణి, 34వ వార్డు బంటారం మాలతి, 35వ వార్డు అఫ్గా మైనా, 36వ వార్డు కల్వ సిరిచందన.

ఇదికూడా చదవండి…

