శివశంకర్ మాస్టర్ కన్నుమూత

తెలంగాణ సినిమా హైదరాబాద్

శివశంకర్ మాస్టర్ కన్నుమూత
– సీనీ పరిశ్రమలో విషాదం
హైద‌రాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: సీని ప‌రిశ్ర‌మ‌లో విషాదం నెల‌కొంది. ప్ర‌ముఖ నృత్య ద‌ర్శ‌కులు శివశంకర్ మాస్టర్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా కరోనా తో బాధపడుతున్న ఆయన కొదిసేపటి క్రితమే కన్ను మూశారు. కరోనా బారిన పడిన దగ్గరనుంచి ఆయన ఆరోగ్యం విషమించింది. కరోనా భారిన పడిన ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన హైదరాబాద్‏లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. శివశంకర్ మాస్టర్ ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకిందని..75శాతం ఇనెఫెక్షన్ ఉండడంతో ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు చెప్తూ వచ్చారు. శివ శంకర్ మాస్టర్ 8 గంటల సమయం లో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. మరోవైపు శివశంకర్ మాస్టర్ భార్యకు కూడా కరోనా సోకడంతో ఆమె హోం క్యారంటైన్లో ఉన్నారు. ఇక మాస్టర్ చిన్న కుమారుడు అజయ్ కృష్ణ తన తండ్రి, అన్న, అమ్మ బాగోగులు చూసుకుంటూ వచ్చారు. ఇదిలా ఉండ‌గా శివశంకర్ మాస్టర్ ఆరోగ్యంగా కోలుకోవాలని సినిమాతారలు ప్రార్ధనలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి, సోనూసూద్, హీరో ధనుష్, మంచు విష్ణు, లారెన్స్ శివశంకర్ మాస్టర్ కుటుంబానికి ఆర్ధిక సాయం చేశారు.