బుర‌ద‌నీటితో ఎమ్మెల్యే స్నానం

జాతీయం తెలంగాణ హైదరాబాద్

బుర‌ద‌నీటితో ఎమ్మెల్యే స్నానం
– జాతీయ రహదారి గుంతలో కూర్చుని నిర‌స‌న
– దెబ్బ‌కు దిగివ‌చ్చిన అధికారులు
– జార్ఖండ్‌ ఎమ్మెల్యే వైఖ‌రిపై హ‌ర్షం
ద‌ర్శిని డెస్క్ : దేశంలోని ఏ ప్రాంతంలో అయినా రోడ్ల దుస్తితి భాగాలేద‌ని పెద‌వి విరుపు విమ‌ర్శ‌లు వినిపిస్తాయి. వర్షాలు పడితే చాలు రోడ్లన్నీ చిత్తడి చిత్త‌డి అయితాయి. రాష్ట్రంలో, కేంద్రంలో పాడైపోయిన రోడ్లను బాగుచేసే నాథుడే లేకుండాపోయాడు. అయితే ప్ర‌భుత్వాల‌కు, అధికారుల‌కు క‌నువిప్పు క‌లిగించ‌డంతో పాటు వారి ప‌నితీరుకు చెంప‌పెట్టు ప‌డేలా ఓ ఎమ్మెల్యే నిర‌స‌న వ్యక్తం చేసింది. దెబ్బ‌కి ప్ర‌భుత్వం స్పందించ‌డం.. అధికారులు దిగిరావ‌డంతో స‌మ‌స్య ప‌రిష్కారానికి మార్గం సుగ‌మ‌మైంది. ఇంత‌కీ ఆ ఎమ్మెల్యే ఏం చేసింద‌ని అధికారులు, ప్ర‌భుత్వం స్పందించింద‌ని ఆలోచ‌న‌లో ప‌డ్డారో.. ప‌దండి మంది ఇంత‌కీ ఈ సంఘ‌ట‌న ఎక్క‌డ జ‌రిగిందో.. ఎలా జ‌రిగిందో తెలుసుకుంది. జార్ఖండ్‌లోని 133వ నెంబర్ జాతీయ రహదారిపై భారీగా గుంతలు పడ్డాయి. ఈ రహదారికి మరమ్మతులు చేపట్టాలని పలు సార్లు జాతీయ రహదారుల విభాగం అధికారులకు ఆమె విన్నవించారు. అయినా వారు పట్టించుకోవడం లేదు. నేషనల్ హైవే అధ్వానంగా మారడంతోపాటు వర్షం కురిస్తే చాలు బురదనీరు రోడ్డుపైనే నిలుస్తోంది. రోడ్డుకు మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల ప్రతీరోజూ ఈ రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా కేంద్ర నేషనల్ హైవే విభాగం అధికారులు పట్టించుకోక పోవడంతో బుధవారం ఎమ్మెల్యే దీపికా పాండే సింగ్ నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గుంతల రోడ్డుపైకి వచ్చి, ఆ రోడ్లపై ఉన్న గుంతల్లోని బురదనీటిలో దిగి స్నానం చేసి నిరసన తెలిపారు. జాతీయ రహదారికి మరమ్మతు పనులు చేపట్టేవరకూ తాను బురదనీటిలో నుంచి బయటకు రానని ఎమ్మెల్యే దీపికా బీష్మించుకు కూర్చున్నారు. బురదనీటిలో మహిళా ఎమ్మెల్యే వినూత్న నిరసనతో ప్రజలు, అధికారులు తరలివచ్చారు. వీలైనంత త్వరగా రోడ్డు మరమ్మతు పనులు చేపడతామని అధికారులు తెలిపారు. అధికారులు, ప్ర‌భుత్వం క‌ల్లు తెరిపించేలా ఎమ్మెల్యే చేసిన వైఖ‌రి ప‌ట్ల ప‌లువురు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.