బల్దియాపై ఎగిరేది బీఆర్ఎస్ జెండానే..!
– కాంగ్రెస్ చేతి గుర్తును నమ్మొద్దు, మరోసారి ఆగమై పోవద్దు
– బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి
– తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– వార్డుల్లో చివరి రోజు విస్తృత ప్రచారం
తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల్లో తాండూరు బల్దియాపై ఎగిరేది బీఆర్ఎస్ జెండానే అని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. సోమవారం చివరి రోజు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు.

మధ్యాహ్నం పట్టణంలోని 25,32,34,36వ వార్డులలో పైలెట్ రోహిత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. గతంలో మంజూరు చేసిన వార్డుకు కోటి రూపాయల నిధులతో ఆయా వార్డుల్లో ప్రజల సమస్యలు తీర్చామన్నారు. కనీస మౌళిక సదుపాలకు ప్రాధాన్యతను ఇచ్చి సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ లో లాంటివి తన హయాంలో నిర్మించామన్నారు.

కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఆరు గ్యారెంటీల పేరుతో అసెంబ్లీ ఎన్నికలో ఓట్లు దండుకొని పారిపోయారు. ఫించన్లు పెంచకుండా, మహిళలకు రూ. 2500లు ఇవ్వకుండా, తులం బంగారం ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు. కావున ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తును నమ్మరాని అన్నారు. నమ్మి ఓటేస్తే మళ్లీ మోసపోతామని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, నాయకులు శ్రీనివాస్ చారి, అబ్దుల్ సలీం, రుద్రుపాటిల్, కరుణాకర్, అనిల్ బాండ్, కౌన్సిలర్ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

