తాండూరు మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీదే..!
– 28 సీట్లు కైవసం చేసుకోవడం ఖాయం
– ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖేల్ ఖతం
– తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ చైర్మన్ సీటును బీఆర్ఎస్ పార్టీ చేసుకోవడం ఖాయమని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు.

బుధవారం తాండూరు పట్టణంలోని 36 వార్డుల్లో కొనసాగుతున్న పోలింగ్ సరళిని పరిశీలించారు. ప్రభుత్వ కాలేజీ వద్ద ఆయన మాట్లాడుతూ..తాండూరులో మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం అని అన్నారు. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసానికి ప్రజలు ఓటు రూపంలో తమ కోపాన్ని చూపించబోతున్నారని అన్నారు.

ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీ ఖేల్ ఖతం అవుతుందని అన్నారు. మరోవైపు పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న ప్రతిపక్ష నాయకులను పైలెట్ రేవంత్ రెడ్డి పలకరించి అల్ ది బెస్ట్ చెప్పారు. రోహిత్ రెడ్డి వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్, నాయకులు శ్రీనివాస్ చారి తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి…

