చైర్మన్, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక బాయికాట్‌..!

తాండూరు రాజకీయం వికారాబాద్

చైర్మన్, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక బాయికాట్‌..!
– బహిష్కరించిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు
– ప్రమాణ స్వీకారం తరువాత బయటకు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నికను బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు బాయికాట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతల చేసిన పనిని నిరసిస్తూ బహిష్కరిస్తున్నట్లు మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు తెలిపారు.

మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి 12 మంది గెలిచిన సంగతి తెలిసిందే. సోమవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారోత్సవానికి మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, పార్టీ కౌన్సిలర్లు ఈర్షాద్, సురేష్‌, జావిద్, నవీన సంతోష్‌ గౌడ్, సుప్రీత కరణాకర్, అనిల్ కుమార్, నాగలక్ష్మీ తదితరులు హాజరయ్యారు. కార్యాయలంలో కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కార్యాలయంలో జరిగిన చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నికను బహిష్కరించి బయటకు వచ్చేశారు.

ఈ సందర్భంగా దీపా నర్సింలు మాట్లాడుతూ మొన్న ఎన్నికల ఫలితాల సమయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రావడాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అడ్డుకోవడం పట్ల కేసు నమోదు చేశారని తెలిపారు. రోహిత్ రెడ్డి, ఇతరులపై కేసులు నమోదు చేయడాన్ని దీనిని వ్యతిరేకిస్తూ బహిష్కరించడం జరిగిందన్నారు. రాజ్యాంగం అధికార పార్టీకే వస్తుందా..? ఎన్నికల్లో ఫలితాలను తారుమారు చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యేకు వర్తించదా.. అని ప్రశ్నించారు. మరోవైపు ప్రమాణ స్వీకారంకు మొత్తం 12 మంది హాజరు కావాల్సి ఉండగా 11 మందే హాజరయ్యారు. 25వ వార్డుకు చెందిన కౌన్సిలర్ భర్త కన్నుమూయడంతో ఆమె ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేక పోయారు.

ప్రమాణ స్వీకారంకు బీజేపీ కౌన్సిలర్లు దూరం