ప్రజా క్షేత్రంలో ఉండండి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ప్రజా క్షేత్రంలో ఉండండి..!
– బీఆర్ఎస్ నూతన కౌన్సిలర్లకు సూచన
– శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజా క్షేత్రంలో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని బీఆర్ఎస్ పార్టీ నూతన కౌన్సిలర్లకు పార్టీ నేతలు సూచించారు.

సోమవారం పట్టణంలోని పైలెట్ రోహిత్ రెడ్డి గారి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జీ పంజుగుల శ్రీశైల్ రెడ్డి, సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ తాండూరు మున్సిపల్‌లో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల ను సన్మానించి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కౌన్సిలర్లు ఎన్నికై వారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. అధికారంలో లేకుండా ప్రజలు నమ్మి గెలిపించినందుకు వమ్ము చేయకుండా పనిచేయాలని సూచించారు.

పాలకవర్గం తప్పు చేస్తే పోరాటం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు విట్టల్ రెడ్డి, ప్రమోదిని, పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, సీనియర్ నాయకులు ఇర్ఫాన్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్లు పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, ఆసీఫ్‌, వరాల శ్రీనివాస్ రెడ్డి, శోభా రాణి, పరిమళ, బొంబిన, మండల పార్టీ అధ్యక్షులు వీరేందర్ రెడ్డి నర్సిరెడ్డి, నాయకులు సర్పంచ్ పాండురంగా రెడ్డి, మారేపల్లి వెంకట రెడ్డి, సిద్రలా శ్రీనివాస్, సంతోష్ గౌడ్, భీమ్ సింగ్, రజాక్, కరుణాకర్ పాటిల్, రుద్రు పాటిల్, వేణు గౌడ్, టిప్పు, మాజీ ఫ్లోర్ లీడర్ శోభారాణి, మాజీ కౌన్సిలర్‌ పరిమళ, నూతన కౌన్సిలర్లు నాగలక్ష్మి అనంత్ రెడ్డి, బి అనిల్ కుమార్, ఎండి ఇర్షాద్, ఎండి జావిద్, సురేష్ నాయక్, నవీన సంతోష్ గౌడ్, నసీరాబాను (ఎజాజ్), అవుసుల యోగానంద్, మహేశ్వరి, సుప్రీత కరుణాకర్ పాటిల్, రూప రుద్రు పాటిల్ తదితరలు ఉన్నారు.

అట్టహాసంగా మున్సిపల్ పాలకవర్గ ప్రమాణ స్వీకారం