పరిశుభ్రతపై అవగాహన పెంచుకోవాలి
– విద్యార్థులకు స్వచ్ఛ సర్వేక్షన్పై వ్యాసరచన పరీక్ష
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజలతో పాటు విద్యార్థులు పరిశుభ్రత పై అవగాహన పెంపొందించుకోవాలని తాండూరు మున్సిపల్ అధికారులు సూచించారు. తాండూరు ఆర్డీఓ, మున్సిపల్ ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు మంగళవారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ నెంబర్ 1 పాఠశాలలో మున్సిపల్ మేనేజర్ బుచ్చిబాబు ఆధ్వర్యంలో విద్యార్థులకు స్వచ్ఛ సర్వేక్షన్పై వ్యాస రచన పోటీలు నిర్వహించారు. తడిచెత్త, పొడిచెత్త, ప్లాస్టిక్ నిషేధం, ప్రమాదకరమైన చెత్త అనే అంశాలపై విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ మేనేజర్ బుచ్చిబాబు, అధికారులు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థులు అవగాహన పెంచుకుని పాటించాలన్నారు. విద్యార్థులకు ఇంట్లో.. పాఠశాలలో పరిసరాల పరిశుభ్రతపై బాధ్యతగా మెలగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్విరాల్‌మెంట్ ఇంజనీర్ ప్రవీణ్ కుమార్, జవాన్లు సిహెచ్ అశోక్, బొట్టు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

