దర్నాపై కేసుల నమోదు దుర్మార్గం

తాండూరు రాజకీయం వికారాబాద్

దర్నాపై కేసుల నమోదు దుర్మార్గం
– పౌరులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలి
– బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం)
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో చేపట్టిన దర్నాపై పోలీసులు కేసులు నమోదు చేయడం దుర్మార్గమని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం) అన్నారు.

చేవేళ్ల రోడ్డు ప్రమాదంలో తాండూరుకు చెందిన 13 మంది మృతి చెందితే.. రోడ్లు బాగు చేయాలంటూ తాండూరు డెవలప్ మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పట్టణంలోని విలియమూన్ చౌరస్తాలో చేపట్టిన దర్నాలో పాల్గొన్న తాండూరు పట్టణ పౌరులపై కేసులు-నమోదు చేయడం దుర్మార్గమని అన్నారు.
kvcs
రోడ్లు బాగుచేయాలంటూ దర్నా చేయడం తప్పా అంటూ ప్రశ్నించారు. తాండూరు పౌరులపై పెట్టిన కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదికూడా చదవండి…

యువకుడి కుటుంబానికి ఆర్థిక సాయం