చత్రపతి శివాజీ మహారాజ్‌కీ జై..!
– తాండూరులో శోభాయామానంగా శోభాయాత్ర
– అంబరాన్నంటిన శివాజీ జయంతి వేడుకలు
– ర్యాలీలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : జై శివాజీ.. వీర శివాజీ అంటూ యువకులు నినాదాల చత్రపతి శివాజీ జయంతి వేడుకలను తాండూరులో అంబరాన్నంటే విధంగా జరుపుకున్నారు. చత్రపతి శివాజీ మహారాజ్ కి జై అంటూ యువత మరాఠా యోధున్ని కీర్తించారు.

గురువారం హిందూ ఉత్సవ సమితి, విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్, హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. శివాజీ జయంతి సందర్భంగా ఆయా సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని కాళికాదేవి ఆలయం నుంచి భారీ శోభాయాత్ర చేపట్టారు. అక్కడి నుంచి ప్రారంభమైన శోభాయాత్ర శాంతి మహాల్ చౌరస్తా, వినాయక్ చౌక్, ఇందిరాదౌక్, మల్లప్ప మడిగ మీదుగా శివాజీ చౌరస్తా వరకు కొనసాగనుంది. ర్యాలీలో యువకులు శివాజీ మహారాజ్ కీ జై, జై శివాజీ.. జైజై శివాజీ.. అంటూ నినాదాలు చేశారు.

పురవీధుల్లో శోభాయాత్ర శోభాయామానంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డి, కౌన్సిలర్లు నాగారం మల్లేశం, ఉమా మహేశ్వరి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు. రమేష్ కుమార్, పూజారి పాండు, హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు, రజనీకాంత్, పర్యాద రామకృష్ణ, లింగదలి రవికుమార్, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, తదితర పార్టీల నాయకులు, సంఘాల ప్రతినిధులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా ఆదేశాల మేరకు తాండూరు పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.


