రోహిత్ రెడ్డికి బేయిల్..!
– కౌంటింగ్ తోపులాట కేసులో ఊరట
– కేసు కొట్టివేత కోసం హైకోర్టులో మరో పిటిషన్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి బేయిల్ మంజూరు అయ్యింది. హైకోర్టు నుంచి బేయిల్ మంజూరు ఉత్తర్వులు జారీ అయినట్లు పార్టీ నేతలు ఓ ప్రకటనలో తెలిపారు.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 13న పట్టణంలోని సెయింట్ మార్క్స్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాల్ వద్ద జరిగిన తోపులాట వివాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో పాటు మరో 8 మంది పార్టీ నాయకులపై తాండూరు పోలీస్ స్టేషన్ లో నాన్ బేయిలేబుల్ కేసు నమోదయ్యింది.

దీనిపై మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు శుక్రవారం తోపులాట కేసులో రోహిత్ రెడ్డికి, పార్టీ నేతలకు బెయిల్ మంజూరు చేసినట్లు పార్టీ నేతలు తెలిపారు. దీంతో రోహిత్ రెడ్డి, నేతలకు ఊరట లభించింది. అదేవిధంగా తాండూరు పోలీసులు పెట్టిన కేసును కొట్టివేయాలని రోహిత్ రెడ్డి మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు.


