తాండూరు న్యాయవాదుల సంఘం ఎన్నిక

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు న్యాయవాదుల సంఘం ఎన్నిక
– అధ్యక్షులుగా కుర్వ శ్రీనివాస్ ఏకగ్రీవం
– ప్రధాన కార్యదర్శిగా పాశం రవికుమార్ విజయం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు న్యాయవాదుల సంఘం ఎన్నికలు గురువారం విజయవంతంగా జరిగాయి. తాండూరు అధ్యక్షులుగా కురువ శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా బరిలో నిలిచిన పాశం రవికుమార్ 6ఓట్లతో విజయం సాధించారు.

ఉపాధ్యక్షులుగా నర్సప్ప, సోఫియా బేగం, సహాయ కార్యదర్శులుగా టి. అరుణ, కమలాకర్, కోశాధికారిగా మస్తాన్ అలీ, మహిళా ప్రతినిధిగా పరమేశ్వరిలు ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా మల్లేష్ యాదవ్, రామయ్య గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలకు సీనియర్ న్యాయవాది మనోహర్ రావు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.

ఈ ఎన్నికల్లో న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ తాండూరు న్యాయవాదుల సంఘం తరుపున న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి, సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. మరోవైపు నూతన సంఘం అధ్యక్ష, కార్యదర్శులకు, సభ్యులకు పలువురు న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు.

దోబీఘాట్.. రగడ..!