రూ. 4లక్షల 10వేల ఆస్తి పన్ను చెల్లింపు
– వీరశైవ సమాజం నుంచి వసూలు
– అందరు ఆస్తి పన్నులు చెల్లించాలి
– మున్సిపల్ కమీషనర్ మధు సూదన్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఒకే సారి తాండూరు మున్సిపల్ ఖజానాలో రూ. 4లక్షల 10వేల ఆస్తి పన్నులు జమ అయ్యాయి.

ఆదివారం తాండూరు వీరశైవ సమాజం నుంచి మున్సిపల్ కమీషనర్ వసూలు చేశారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఆదివారం సెలవు దినం అయినప్పటికి అధికారులు ఆస్తి పన్నుల వసూళ్లు చేపట్టారు. పట్టణంలో పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్న దేవాలయాలు, కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలను లక్ష్యంగా చేసుకుని కమీషనర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పన్నులు వసూలు చేస్తున్నారు.

ఇందులో భాగంగా తాండూరు వీరశైవ సమాజం నుంచి రూ. 4లక్షల 10వేల ఆస్తి పన్నులను వసూలు చేశారు. సమాజం పెద్దలు మున్సిపల్ కమీషనర్ మధుసూదన్ రెడ్డికి ఆస్తిపన్నులకు సంబంధించిన చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ తాండూరు పట్టణ ప్రజలు, వ్యాపారులు, యజమానులు అందరు ఆస్తి పన్నులను చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, సిబ్బంది ఉన్నారు.


