భద్రేశ్వరుని కృప మెండుగా ఉండాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

భద్రేశ్వరుని కృప మెండుగా ఉండాలి
– రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్
– జాతర ఉత్సవాలలో భక్తులకు అన్నదానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రజలపై భద్రేశ్వర స్వామి కృప మెండుగా ఉండాలని రాష్ట్ర బీసీ కమీషన్‌ మాజీ సభ్యులు శుభప్రద్‌ పటేల్ అన్నారు.

పట్టణంలో కొనసాగుతున్న భద్రేశ్వర జాతర ఉత్సవాలలో శుభప్రద్ పటేల్ పాల్గొన్నారు. దేవాలయంలో వెలసిన స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో దాసోహ మందిరంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శుభప్రద్ పటేల్ స్వయంగా భక్తులకు ప్రసాదం వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రేశ్వర స్వామి జాతరలో అన్నదానం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.

భద్రేశ్వర స్వామి ఆశీస్సులతో తాండూర్ ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు శుభప్రద్ పటేల్ తెలుపారు. ఈ కార్యక్రమంలో జాతర ఉత్సవ కమిటి చైర్మన్ మేడి మహేష్, మాజీ చైర్మన్ బంటారం సుధాకర్, జొన్నల బస్వరాజ్, విజయకుమార్, కౌన్సిల్లోర్లు సురేష్ నాయక్, కరుణాకర్, వీరశైవ యువదళ్ అధ్యక్షులు వాలి వినోద్, చందు, శ్రావణ్, వినోద్, రామకృష్ణ, శ్రీనివాస్, నాయకులు పటేల్ విజయ్ కుమార్, సుదర్శన్ గౌడ్, శుభప్రద్ యువసేన సభ్యులు విజయ్, నరేష్ గౌడ్, చందు పటేల్, నవీన్ మనోహర్, రాము నాయక్, రవీందర్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, పలు కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అనుమతుల్లేకుండా ఇసుక రవాణా