ప్రభుత్వ భూమిలో అక్రమాలు ఆపండి

తాండూరు రాజకీయం వికారాబాద్

ప్రభుత్వ భూమిలో అక్రమాలు ఆపండి
– సర్వేనెంబర్ 130లో నిర్మాణాలపై ఫిర్యాదు
– కమీషనర్‌కు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ల బృందం విజ్ఞప్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ భూమిలో జరుగుతున్న అక్రమాలను ఆపాలని బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల బృందం డిమాండ్ చేశారు.

గురువారం మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్, బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ పట్లోళ్ల దీపా నర్సింలు ఆధ్వర్యంలో పార్టీ కౌన్సిలర్లు మున్సిపల్ కమీషనర్‌ మధుసూదన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. మున్సిపల్ ముందు ఉన్న ప్రాంతం ప్రభుత్వ భూమి సర్వేనెంబర్ 130లో సుమారు 36 గుంటల భూమిలో అధికార పార్టీకి చెందిన అమీర్ అబ్దుల్లా అనే వ్యక్తి అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నట్లు తెలిపారు. దాదాపు 300 గజాల విస్తీర్ణంలో మేయిన్‌ రోడ్డుకు అనుకుని దుకాణాల నిర్మాణాలు చేపడుతున్నారని అన్నారు.

ఇట్టి స్థలం ప్రభుత్వ భూమి అనేందుకు తగిన ఆధారాలు కూడా ఉన్నాయని మున్సిపల్ అధికారులకు చేసిన ఫిర్యాదులో పేర్కోన్నారు. అదేవిధంగా ఇదే ప్రదేశంలో మరో అక్రమ భవనం నిర్మాణం చేపట్టారని తెలిపారు. మున్సిపల్ కార్యాలయం ఎదుటే యేధేచ్చగా అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు జరుగుతుంటే పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సర్వేనెంబర్ 130లోని 36 గుంటల ప్రభుత్వ భూమిని వెంటనే స్వాదీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అమీర్ అబ్దుల్లా చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై క్రిమినల్ కేసులు పెట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఈర్షాద్, జావిద్, సురేష్ నాయక్, యోగానంద్, నవీన సంతోష్ గౌడ్, రూప రుద్రుపాటిల్, ఉమా మహేశ్వరి, సుప్రీత కరుణాకర్ తదితరులు ఉన్నారు.

తాగునీటి శాశ్విత పరిష్కారంపై దృష్టి