పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
– మురిసి పోయిన మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో మురిసిపోయారు.

ఆదివారం నిజాంపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1999 -2000 పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు 26 ఏళ్ల తర్వాత ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. ఈ వేడుకలో తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్య నేర్పిన గురువులను ప్రత్యేకంగా ఆహ్వానించి సత్కరించారు.

అనంతరం పూర్వ విద్యార్థులు చదువున్న నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుని మైమరిచి పోయారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ తమ విద్యార్థులు అన్ని రంగాలలో ఉన్నత స్థాయిలో ఉండటం గర్వకారణంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గురునాథ్, నరేందర్, పద్మజ, ఉప , సర్పంచ్ గంగాధర్, లక్ష్మణ్, శ్రీనివాస్, సత్యం, నగేష్, మధు, ప్రవీణ్, మాజీ మున్సిపల్ చైర్మన్ స్వప్న, శిరీష, శ్వేత, శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు.


