వచ్చే నెల 2నుంచి విఠలేశ్వర స్వామి జాతర
– తాండూరు ఎమ్మెల్యే చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ
– ఉత్సవాల జయప్రదంకు పిలుపు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే నెల 2నుంచి యాలాల మండలం తిమ్మాయిపల్లిలో విఠలేశ్వర జాతర ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.

ఈ జాతర ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆవిష్కరించారు. మంగళవారం గ్రామ సర్పంచ్ అమర్నాథ్ రెడ్డి, జాతర ఉత్సవ కమిటి సభ్యులు హైదరాబాద్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా వచ్చేనెల 2, 3, 4వ తేదిలలో జరిగే విఠలేశ్వర జాతర ఉత్సవాలకు హాజరు కావాలని ఎమ్మెల్యేను కోరారు. అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా జాతర ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరింపజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విఠలేశ్వర స్వామి జాతర ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. అదేవిధంగా 4వ తేదిన జాతర ఉత్సవాలకు హాజరవుతున్నట్లు హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ నర్సిములు, గ్రామస్తులు భీంరెడ్డి, వడ్లదామోదర్, అయ్యగళ్ళ భీమయ్య, మేకలరాజు, రవిందర్ రెడ్డి, ఈడిగి రాజు, శ్రీధర్ రెడ్డి, జగదీష్, నర్సిములు తదితరులు ఉన్నారు.


