ముగ్గురు పేకాట రాయుళ్ల అరెస్టు
– యాలాల మండలంలో ఘటన
– కేసు నమోదు చేసిన పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : శివారు ప్రాంతంలో పేకాట ఆడుతున్న ముగ్గురుని యాలాల పోలీసులు అరెస్టు చేశారు. యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

యాలాల మండలం శివారులో ఫర్దేకుంట వద్ద ముగ్గురు వ్యక్తులు పేకాట ఆడుతున్నారని సమాచారం అందింది. ఈ మేరకు ఎస్ఐ విఠల్ రెడ్డి తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో మండలంలోని సంఘం కుర్దు గ్రామానికి చెందిన ఊరి బయట రాజు, అల్లకోటి విష్ణు, మీది కేరి వెంకటయ్య అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 2800లను సీజ్ చేయడంతో పాటు పేకాట ముక్కలను స్వాదీనం చేసుకున్నారు.

ఈ మేరకు వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా ఎస్ఐ మాట్లాడుతూ ఎవరైనా చట్ట వ్యతిరేకమైన పనులకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు.


