మున్నూరుకాపులు రాజకీయంగా ఎదగాలి
– తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పుట్టం పురుషోత్తం
– సన్మానించిన తాండూరు మున్నూరుకాపు సంఘం
తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్నూరుకాపులు రాజకీయంగా ఎదగాలని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ పుట్టం పురుషోత్తం అన్నారు.

మంగళవారం తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని తులసీ గార్డెన్లో మున్నూరుకాపు సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు పుట్టం పురుషోత్తం హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్నూరు కాపుల అభ్యున్నతి కోసం సంఘటితం కావాలన్నారు. మున్సూరుకాపులోని ఇతర కులాలలను కలుపుకొని బహుజన రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని అన్నారు. మున్నూరుకాపులు రాజకీయంగా బలంగా ఎదిగిన నాడే మన ఉనికి సమాజానికి తెలుస్తుంది అన్నారు. అదేవిధంగా అతి త్వరలో వికారాబాద్ జిల్లా ఎన్నికలు నిర్వహించాలని కోరారు.

అనంతరం తాండూరు సమాజం అధ్వర్యంలో పుట్టం పురుషోత్తంను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నర్సిములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆవుల రామారావు పటేల్, రాష్ట్ర కార్యదర్శులు బెజ్జు శ్రీధర్ పటేల్, నింగాల శంకర్ పటేల్, ప్రచార కార్యదర్శి బురకని నాగేష్ పటేల్, సంయుక్త కార్యదర్శి అరిగే అనంత ప్రసాద్, రాష్ట్ర కార్యవర్గం సభ్యులు మున్నూరు బుచప్ప పటేల్, రాష్ట్ర యువత ఉపాధ్యక్షులు తాండ్ర నరేష్ పటేల్, కోట్ల నరేందర్ పటేల్, వెంకట రామ రెడ్డి పటేల్, రాములు పటేల్, మున్నూరు కిరణ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.


