రేపు ఎస్‌ఐఆర్ సమీక్షా సమావేశాలు..!
– మండలాల వారిగా షెడ్యూల్ ఖరారు
– హాజరు కానున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– విజయవంతం చేయాలని సర్ కన్వినర్ కరణం పురుషోత్తం రావు పిలుపు
తాండూరు, దర్శని ప్రతినిధి : ఎస్ఐఆర్ కార్యక్రమంపై రేపు గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.

ఈ సమావేశాలను విజయవంతం చేయాలని నియోజకవర్గ ఎస్ఐఆర్ కన్వీనర్, టీపీసీసీ ప్రచార సమన్వయ కర్త కరణం పురుషోత్తం రావు కోరారు. మండలాల వారిగా సమావేశాల వేదికలను ఖరారు చేశారు. గురువారం ఉదయం 9-30గంటలకు తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తాండూరు పట్టణానికి సంబంధించిన సమావేశం జరుగుతుందని తెలిపారు.

అదేవిధంగా ఉదయం 11గంటలకు బషీరాబాద్ మండలంలోని గుర్రాల అనంతమ్మ ఫంక్షన్ హాల్, మధ్యాహ్నం 12-30గంటలకు యాలాల మండలం చెన్నారం గేటు, మధ్యాహ్నం 2-30 గంటలకు తాండూరు మండలంకు సంబంధించిన సమావేశం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరుగుతుందని తెలిపారు. సాయంత్రం 4గంటలకు పెద్దేముల్ మండల కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ సమావేశానికి ఎస్‌ఐఆర్ పర్యవేక్షకులుగా టీపీసీసీ కోటిం వినయ్ రెడ్డి, జగదీశ్వర్ రావు పాల్గొంటారని చెప్పారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ధారసింగ్ పాల్గొంటారని తెలిపారు. కావున ఈ సమావేశాలకు మండల పార్టీ అధ్యక్షులు, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, మండల మహిళ నాయకులు, బీఎల్‌ఏలు, క్లస్టర్ ఇంచార్జీలు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు తప్పక పాల్గొనాలని సర్ కన్వీనర్ కరణం పురుషోత్తం రావు విజ్ఞప్తి చేశారు.


