పేద విద్యార్థులకు మార్వాడి యువమంచ్ చేయూత

తాండూరు రాజకీయం వికారాబాద్

పేద విద్యార్థులకు మార్వాడి యువమంచ్ చేయూత
– నోటు పుస్తకాలు, పలకలు, పెన్సిళ్ల పంపిణీ
– పెద్దేముల్ మండలంలో సేవా కార్యక్రమం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మార్వాడి యువమంచ్ పేద విద్యార్థులకు చేయూతను అందించింది.

సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా బుధవారం పెద్దేముల్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నోటు పుస్తకాలు ఇతర వస్తువులను పంపిణీ చేశారు. మండలంలోని మంబాపూర్, ఖానాపూర్, దుగ్గాపూర్, రుక్మాపూర్, మదనంతాపూర్, మాన్సాన్‌పల్లి ప్రాథమిక పాఠశాలల్లో మొత్తం 260 మంది విద్యార్థులకు 1,100 నోటు పుస్తకాలు, 25 స్లేట్లు, 260 పెన్సిళ్లు, 260 రబ్బర్లు, 260 స్కేళ్లు పంపిణీ చేశారు.

దీంతోపాటు చాక్లెట్లు, బిస్కెట్లు, చిప్స్, ఫ్రూటీ అందజేశారు. ఈ సందర్భంగా జాతీయ కన్వీనర్ మన్మోహన్ సార్డా మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా ఆల్ ఇండియా మార్వాడీ యువ మంచ్ తాండూర్ శాఖ విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలకు చేరుకుని సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో శాఖ అధ్యక్షుడు కిషన్ రాఠీ, కార్యదర్శి కరణ్ జైన్, సభ్యులు అనిల్ సార్డా, శ్రీకాంత్ సార్డా , రమాకాంత్ పండిట్, నిఖిల్ గగ్రాణి, కిషన్ బూబ్, అంకిత్ సార్డా, దీపక్ బూబ్, దీపక్ సోని, గిరిధర్ పర్థాని, మాధవ్ పర్థాని, నితిన్ సార్డా, సామాజిక కార్యకర్త కేవీఎం వెంకట్, ఆయా పాఠశాలలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేపై వాఖ్యలను వక్రీకరిస్తే ఖబడ్దార్..!