అన్నను హత్య చేసిన తమ్ముడి రిమాండ్

క్రైం తాండూరు వికారాబాద్

అన్నను హత్య చేసిన తమ్ముడి రిమాండ్
– వెల్లడించిన తాండూరు రూరల్ సీఐ రాంబాబు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : పొలం డబ్బుల విషయంలో అన్నను హత్య చేసిన తమ్ముడిని తాండూరు రూరల్ పోలీసులు రిమాండుకు తరలించారు. శనివారం తాండూరు రూరల్ సీఐ రాంబాబు మీడియాకు వివరాలను వెల్లడించారు. వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం గోనూర్ గ్రామానికి చెందిన మాచనూరు శ్రీనివాస్ (40)ను శుక్రవారం అతని తమ్ముడు శివకుమార్ పత్తి పొలంలో హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటన గ్రామంలో కలకలం రేపింది. పొలం విక్రయించగా వచ్చిన డబ్బుల విషయంలో అన్నదమ్ముల మద్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే అన్న శ్రీనివాస్ గొంతుకు టవల్ బిగించి శివకుమార్ హత్యచేశాడు. అనంతరం పరారిలో ఉన్నాడు. మృతుని భార్య బుజ్జమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. దీంతో పోలీసులు శివకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో శివకుమార్ నేరాన్ని అంగీకరించినట్లు సీఐ రాంబాబు తెలిపారు. ఈ మేరకు శనివారం నిందితుడు శివకుమార్ ను రిమాండుకు తరలించినట్లు రూరల్ సీఐ రాంబాబు వెల్లడించారు.