టీఆర్ఎస్‌ఎంఏ తాండూరు నూతన కార్యవర్గం ఎన్నిక

తాండూరు రాజకీయం వికారాబాద్

టీఆర్ఎస్‌ఎంఏ తాండూరు నూతన కార్యవర్గం ఎన్నిక
– అధ్యక్షులుగా ఎంవీఎన్‌ మోహన్ గౌడ్‌, ప్రధాన కార్యదర్శిగా వెంకటేష్‌
– ఆమోదం తెలిపిన రాష్ట్ర, జిల్లా కమిటి సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (టీఆర్ఎస్‌ఎంఏ) తాండూరు నూతన కార్యవర్గం బుధవారం ఏర్పాటయ్యింది.

రాష్ట్ర కమిటీ, వికారాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నూతన కమిటి ఎన్నిక ప్రక్రియ జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు అధ్యక్షులు ఎస్‌ఎన్‌ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు నాగయ్య, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బస్వరాజ్ గౌడ్, రాష్ట్ర సలహాదారు ముజీబ్ ఉర్ రహ్మాన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరేష్ రాజు, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు వెంకట్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు వీరేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి అభిలాష్ రెడ్డి, జిల్లా కోశాధికారి ప్రకాష్‌ల సమక్షంలో ఎన్నికను నిర్వహించారు.

తాండూరు డివిజన్‌లోని గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు, యాజమాన్యాల ప్రతినిధులతో విస్తృతంగా చర్చలు జరిపి మెజారిటీ సభ్యుల అభిప్రాయాల మేరకు నూతన కమిటిని ఎన్నుకున్నారు. 2026 – 2028 సంవత్సరానికి గాను తాండూరు నూతన కార్యవర్గం గౌరవాధ్యక్షులుగా కీర్తి శర్మ, అధ్యక్షులుగా ఎంవీఎన్ మోహన్ కృష్ణ గౌడ్, ఉపాధ్యక్షులుగా వహీద్, ప్రధాన కార్యదర్శిగా వెంకటేష్‌, సంయుక్త కార్యదర్శిగా సునీత, కోశాధికారిగా ఎం.రమేష్‌ గౌడ్, సలహా కమిటి సభ్యులుగా ఇందూరు రాములు, సోహెల్ ఉమ్రిలను ఎన్నుకున్నారు.

ఈ కమిటిని రాష్ట్ర, జిల్లా కమిటి సభ్యులు ఆమోదించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండూరులో సంఘ ఐక్యతను కాపాడడం, ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడం కోసం టీఆర్ఎస్‌ఎంఏ కృషి చేస్తుందని అన్నారు. అదేవిధంగా గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల హక్కులు, ప్రయోజనాలను పరిరక్షించడమే లక్ష్యంగా ఈ కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. అనంతరం నూతన కమిటికి శుభాకాంక్షలు తెలిపారు.

పేద విద్యార్థులకు మార్వాడి యువమంచ్ చేయూత