30 ఏండ్లు ఓ లెక్క.. ఇకనుంచి మరో లెక్క..!
– అభివృద్ధితో తాండూరు రూపు రేఖలు మారుస్తాం
– ఇచ్చిన హామికి పాత తాండూరులో రైల్వే బ్రిడ్జి
– త్వరలోనే బస్తిదవఖాన ఏర్పాటు చేయిస్తాం
– పౌరసన్మానంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో 30 ఏండ్ల పాలన ఓ లెక్క.. ఇప్పటి నుంచి మరోలెక్క.. తాండూరును ఇకనుంచి అభివృద్ధి వైపు నడిపిస్తామని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఉద్ఘాటించారు. ఉత్తుత్తి ప్రొసిడింగ్స్.. కల్లబొల్లి మాటలతో నడిచిన కాలానికి అవరమైతే చరమగీతం పాడాల్సిందేనని ధ్వజమెత్తారు.

తాండూరు మున్సిపల్ పరిధిలోని పాత తాండూరుకు చిరకాల వాంచగా నిలిచిన రైల్వే బ్రిడ్జి కోసం రూ. 74 కోట్ల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి శుక్రవారం రాత్రి పౌరసన్మానం ఏర్పాటు చేశారు. జోరు వర్షంలోనూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పాల్గొని ప్రసగించారు. గతంలో 30 ఏండ్లు పాలించిన పాలకులు ఉత్తుత్తి ప్రొసిడింగ్స్ అందించారని, కల్లబొల్లి మాటలతోనే అరచేతి అభివృద్ధి చూపించారన్నారు. కొన్నేండ్ల క్రితమే పాత తాండూరుకు రైల్వే బ్రిడ్జి మంజూరైనా నిధులు తీసుకరావడంతో విఫలమయ్యారన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సహాకారంతో పాత తాండూరు రైల్వే బ్రిడ్జికి రూ. 74 కోట్లు సాధించుకు రావడం జరిగిందన్నారు.
గతంలో పాత తాండూరుకు వాసులకు ఇంటింటికి తాగునీరు, రైల్వే బ్రిడ్జి, బస్తీదవఖానలపై హామీలు ఇవ్వడం జరిగిందని గుర్తుచేశారు. ఇందులో భాగంగా మిషన్ భగీరథ తాగునీరు, తాజాగా రైల్వే బ్రిడ్జి సాధించగా త్వరలోనే పాతతాండూరులో బస్తీదవఖాన ఏర్పాటుకు కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. మరొ వైపు 30 ఏండ్లు మభ్య పెట్టిన నాయకుల మాటలు ఇకనుంచి నమ్మొద్దన్నారు. వారి ఉనికి కోసమే ప్రజాయాత్రలు చేస్తున్నారని విమర్శించారు. తాండూరు ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచాక అవాంతరాలు వచ్చాయని, ఇక నుంచి తాండూరు రూపు రేఖలు మార్చి ఆదర్శంగా తీర్చుదిద్దుతానని పేర్కొన్నారు.
అనంతరం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పాత తాండూరులో బోనమ్మను దర్శించుకున్నారు. అక్కడి నుంచి దర్గావద్దకు చేరుకుని నేతలతో కలిసి ప్రార్థనలు చేశారు. అంబేద్కర్ పార్కులో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, టీఆర్ఎస్ అధికార ప్రతినిధి రాజుగౌడ్, పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), ఏఎంసీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, కౌన్సిలర్లు వసంత, అశ్విని, సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్, పాత తాండూరు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

