విద్యార్థులతో పెట్టుకోవద్దు..!
– వారు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారు
– కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామనే సాక్షం
– ఎన్‌ఎస్‌యూఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అంకిత్ అనురాగ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవాలని చూస్తే.. ఎవ్వరికైనా గుణపాఠం తప్పదని ఎన్‌ఎస్‌యూఐ వికారాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అంకిత్ అనురాగ్ అన్నారు.

శనివారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్ వ్యవహారం కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామపై స్పందన వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీక్ విషయంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో విద్యార్థుల పోరాటం ఫలించిందని అన్నారు.

కేంద్ర ప్రభుత్వంతో యుద్దంలో విద్యార్థులే అంతిమ విజయం సాధించారని హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అని మరో సారి రుజువయ్యిందని అన్నారు.

విద్యార్థులతో పెట్టుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయని నిరూపించారని అన్నారు. ఈ రాజీనామా, విద్యార్థుల విజయం స్పూర్తిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.


