వైభవంగా గురు పౌర్ణిమ

తాండూరు రాజకీయం వికారాబాద్

వైభవంగా గురు పౌర్ణిమ
– కోకట్ సాయి మందిరానికి పోటెత్తిన భక్తులు
– మూల విరాఠ్ విగ్రహానికి పుష్పాభిషేకం
– పూజలు నిర్వహించిన చైర్ పర్సన్, నేతలు
– మొక్కులు తీర్చుకున్న భావనోళ్ల కుటుంబం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో గురు పౌర్ణిమ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. బుధవారం గురు పౌర్ణమి సందర్భంగా కోకట్ రోడ్డు మార్గంలో ఉన్న శ్రీ షిర్డి సాయి బాబా మందిరానికి భక్తులు పోటెత్తారు.

ప్రతి యేడాది మాదిరిగానే దేవాలయంలో సాయి బాబాకు ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం అభిషేకం, హారతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులతో మూల విరాఠ్ విగ్రహానికి పూలాభిషేకం నిర్వహించారు. దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. బాబాను దర్శించుకుని పూజలు నిర్వహించారు.

అదేవిధంగా దేవాలయంలో పూజా కార్యక్రమాలలో తాండూరుకు చెందిన ప్రముఖ రియల్ ఏస్టేట్ వ్యాపారి భావనోళ్ల శంకర్ యాదవ్, సతీమణి చంద్రకళ, కుమారుడు అభినవ్ సాయి తదితరులు పాల్గొన్నారు. ఆలయంలో బాబాకు కానుకలు సమర్పించి.. పూజా కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిపించి మొక్కులు తీర్చుకున్నారు. దేవాలయానికి వచ్చే భక్తులకు అన్నదానం, ప్రసాద వితరణ కార్యక్రమాలను చేపట్టారు.

తాండూరు మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా, బీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు కూడా కుటుంబ సమేతంగా తరలివచ్చి బాబాను దర్శించుకున్నారు. మరోవైపు గురు పౌర్ణమి సందర్భంగా దేవాలయానిక తాండూరు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు.

ఉదయం నుంచి దేవాలయానికి భక్తుల తాకిడి కొనసాగింది. దేవాలయంలో బాబాను సర్మిస్తూ సాయి నామస్మరణను మార్మోగించారు. దీంతో దేవాలయానికి గురు పౌర్ణమి శోభ సంతరించుకుంది. ఈ కార్యక్రమాల్లో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, నాయకులు బంటు మల్లప్ప, కందుకూరి రాజ్ కుమార్, ప్రభాకర్ గౌడ్, మనోహర్ యాదవ్, సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

చెట్టే జ్ఞాపకం..!