మళ్లీ ముంచుకోస్తున్న వర్షాలు..!

జాతీయం తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

మళ్లీ ముంచుకోస్తున్న వర్షాలు..!
– ఆగస్టు 15 నుంచి కురిసే అవకాశం
– ప్రకటించిన వాతావరణ శాఖ
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు ముంచుకోస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆగస్టు ప్రారంభం నుంచి కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు తప్ప భారీ వర్షాలు కురవలేదు. కాగా.. ఇప్పుడు మూడు రోజుల తరువాత వర్షాలు పడే ఛాన్స్‌ ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్ర మట్టం ఉపరితల ఆవర్తనం ఏర్పాటు ప్రభావం వల్ల ఆగస్టు 15 తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆగస్టు 15 నుంచి తెలంగాణతో పాటు ఉత్తరాంధ్రలో కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.

రాయలసీమలో వాతావరణం పొడిగా ఉంటుందని అంచనా. ఏపీ కోస్తాలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనికి తోడు, సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి అంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా కొమోరిన్ ప్రాంతం వరకు కొనసాగుతుందని ఆయన చెప్పారు. దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయి. ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కడప, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి.

ఇది కూడా చదవండి..

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!