విద్యార్థుల మధ్య ఘర్షణ దురదృష్టకరం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

విద్యార్థుల మధ్య ఘర్షణ దురదృష్టకరం..!
– పరిస్థితులను చక్కదిద్ది విచారణ జరపాలి
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆట విషయంలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడం దురదృష్టకరం అని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు కందుకూరి రాజ్‌కుమార్‌ అన్నారు.

హైదరాబాద్ రోడ్డు మార్గం లోని గురుకుల పాఠశాలను ఆదివారం ఉదయం సందర్శించిన ఆయన.. ఘటనకు సంబంధించిన వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఎదుర్కొన్న పరిస్థితులు, ఘటనకు దారితీసిన కారణాలపై ఆరా తీశారు.

అనంతరం పోలీసు అధికారులను కలిసి ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని కోరారు. దర్యాప్తు తర్వాత తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల భద్రత విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, గురుకుల పాఠశాలల్లో వారికి ప్రశాంతమైన, సురక్షితమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని రాజ్‌కుమార్‌ పేర్కొన్నారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్‌, యాలాల మండల అధ్యక్షుడు లక్ష్మణచారి, బీసీ యువ నాయకులు పరమేష్‌, పాండుగౌడ్‌, రమేష్‌, అశోక్‌, రజక పరమేష్‌, నాయి పరమేష్‌, వివేక్‌, శ్రీశైలం, శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

లేబర్‌ కార్డు ఉంటే.. భరోసా బోలెడు..!