ఉర్సుకు ముర్షద్ దర్గా ముస్తాబు
– ఎల్లుండి నుంచి ఉర్సేషరీఫ్ ఉత్సవాలు
– రేపు అమెరికా నుంచి స్కాలర్‌ల రాక
– జయప్రదం చేయాలని ముతవల్లి విజ్ఞప్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ముర్షద్ దర్గా ఉర్సు ఉత్సవాలకు ముస్తాబయ్యింది. ఎల్లుండి నుంచి 79వ ఉర్సు ఉత్సవాలు నిర్వహిస్తుట్లు నిర్వహకులు ముతవల్లి అల్హజ్ సయ్యద్ అబ్దుల్ గనిపాష మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

దర్గాలో హజ్రత్ సయ్యద్ అబ్దుల్ కరీం పాష సాహెబ్ ఖిబ్లా చిష్తి ఖలందరి మిర్జాయి రహమతుల్లా అలై గారి 79వ ఉర్సే షరీఫ్‌తో పాటు హజ్రత్ సయ్యద్ అబ్దుల్ సలాం పాష సాహెబ్ ఖిబ్లా చిష్తి ఖలందరి మిర్జాయి రహమతుల్లా అలై గారి 19 ఉర్సే షరీఫ్ ఉత్సవాలు జరుగుతాయని వెల్లడించారు. గురువారం రాత్రి 7 గంటలకు గంధము వారి ఇంటి నుంచి బయల్దేరి 8గంటలకు దర్గా షరీఫ్‌కు చేరుకుని సందల్ మాలి నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

అదేవిధంగా 8వ తేది శుక్రవారం దీపోత్సవం, రాత్రి 9-30గంటలకు ఖవ్వాలి, 9వ తేది శనివారం నమాజ్ బాద్ ఫజర్ తిలావత్ ఖురస్పాక్, ఉదయం 8గంటలకు ఫాతేహఖ్వాని, ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు. మరోవైపు ఈ యేడాది ఉర్సు ఉత్సవాలను పురస్కరించుకుని రేపు బుధవారం ముర్షద్ దర్గాకు అమెరికా నుంచి ప్రముఖ స్కాలర్ సయ్యద్ షా నజ్మోద్దీన్ ఖాద్రి ముఖ్య అతిథిగా హాజరువుతన్నారని తెలిపారు. కావున ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గోని ఉర్సేషరీఫ్ను జయప్రదం చేయాలని కోరారు.

ఇదికూడా చదవండి..

