తాండూరు తాగునీటికి భరోసా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు తాగునీటికి భరోసా..!
– కాగ్నా నది నీటి సరఫరాకు రూ. 110 కోట్లు
– ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషితో జీవో విడుదల
– మరో రూ. 46 కోట్లతో సివరేజ్ పంపుల నిర్మాణం
– చెప్పినా.. చెప్పకున్నా అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే
– తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషితో భరోసా అందబోతోందని మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు అన్నారు.

సోమవారం తాండూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, నేతలు, కౌన్సిలర్లు మాట్లాడుతూ తాండూరు కాగ్నానది ద్వారా తాండూరు పట్టణం, యాలాల మండలంలోని గ్రామాలకు తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.

మిషన్‌ భగీరథ తాగునీటి సరఫరాకు ప్రత్యాత్నామయంగా తాండూరు కాగ్నానది నుంచి నీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం టఫ్‌ ఐడీసీ ద్వారా రూ. 110 కోట్లను మంజూరు చేసిందని వెల్లడించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తాండూరులో తాగునీటి ఇబ్బందులను దృష్టిలోకి తీసుకెళ్లడంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ద్వారా జీఓ మంజూరు చేయడం జరిగిందని వివరించారు. తాండూరుతో పాటు యాలాల మండలంలోని గ్రామాలకు తాండూరు కాగ్నానది నుంచి తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. తాండూరుకు రెండు పూటల తాగునీరు అందించడం జరుగుతుందని తెలిపారు.

అదేవిధంగా తాండూరు కాగ్నానదిలో మరో రూ. 46 కోట్లతో సివరేజ్ పంపులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చెప్పినా.. చెప్పక పోయినా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. శిలాఫలాకాలు వేయకుండా, ఉత్తుత్తి జీవోలు తీసుకరాకుండా, అధికారిక ప్రోసిడింగ్‌లు వచ్చిన తరువాతే పక్కా ప్రణాళికతో అభివృద్ధి చేస్తున్నారని స్పష్టం చేశారు. ఇప్పటికే చిలుకవాగు, కోట్‌పల్లి ప్రాజెక్టు, ఇందిరమ్మ ఇళ్లు తదితర పనుల్లో భాగంగా రూ. 1500 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.

తాండూరు కాగ్నానది ద్వారా నీటి సరఫరా కోసం నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నిధుల మంజూరుపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ వడ్డె శ్రీనివాస్, మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, వైస్ చైర్మన్ ఖాసిం అలీ, సీనీయర్ నాయకులు సర్దార్ ఖాన్, కౌన్సిలర్లు బాలకృష్ణ రెడ్డి, దివిటి ఎల్లప్ప, మాజీ కౌన్సిలర్ బోయరవి, మార్కెట్ కమిటి డైరెక్టర్లు తదితరులు ఉన్నారు.

మా నాయకులపై నోరుజారితే.. ఖబడ్దార్..!