డాక్టర్‌ శరత్‌చంద్ర సేవలు అభినందనీయం

తాండూరు రాజకీయం వికారాబాద్

డాక్టర్‌ శరత్‌చంద్ర సేవలు అభినందనీయం
– ఆదిత్య హాస్పిటల్‌ అధినేతకు ప్రశంసలు
– శుభాకాంక్షలు తెలిపిన శంకర్‌ యాదవ్, ప్రముఖులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఆదిత్య హాస్పిటల్‌ అధినేత డాక్టర్‌ భీమ్‌శెట్టి శరత్‌చంద్ర అందిస్తున్న సేవలు అభినందనీయమని సాయిపుత్ర హోమ్స్‌ అధినేత బావనోళ్ల శంకర్‌ యాదవ్‌ అన్నారు.

ఇటీవల నూతనంగా నిర్మించిన ఆదిత్య హాస్పిటల్‌ ప్రారంభమైన సందర్భంగా శుక్రవారం శంకర్ యాదవ్ తన మిత్రబృందంతో కలిసి డాక్టర్‌ శరత్‌చంద్రను ఘనంగా సన్మానించారు.

శంకర్‌ యాదవ్‌తో పాటు గోశాల గౌరవాధ్యక్షులు పట్లోళ్ల వేణుగోపాల్‌రెడ్డి, బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, స్పైసీ మనోహర్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు బంటు మల్లప్ప తదితరులు డాక్టర్‌ శరత్‌చంద్రకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన ఆసుపత్రి ద్వారా తాండూర్‌ ప్రాంత ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు.

డాక్టర్‌ శరత్‌చంద్ర అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించి.. అందరివాడుగా పేరు పొందడం అభినందనీయమని అన్నారు. వైద్య సేవలతో ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్న ఆయన.. ఆదిత్య హాస్పిటల్‌ ద్వారా మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు.

విద్యావేత్తలపై దాడులు దుర్మార్గం