జెట్టెపాగ నరేష్‌ మృతి బాధాకరం

తాండూరు రాజకీయం వికారాబాద్

జెట్టెపాగ నరేష్‌ మృతి బాధాకరం
– కుటుంబాన్ని పరామర్శించిన బీఎస్‌ఆర్‌
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆరోగ్య సమస్యలతో మృతి చెందిన జెట్టెపాగ నరేష్‌ కుటుంబాన్ని సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు, ఆర్‌బీఓఎల్‌ సీఈఓ బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి (బీఎస్‌ఆర్‌) పరామర్శించారు.

మంగళవారం నివాసానికి చేరుకుని నరేష్ మృత దేహానికి పూలు వేసి నివాళులు అర్పించారు. నరేష్‌ మృతి పట్ల బీఎస్‌ఆర్‌ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులు అధైర్య పడొద్దని ధైర్యం చెప్పారు.

బీఎస్‌ఆర్‌తో పాటు 15వ వార్డు కౌన్సిలర్‌ దివీటీ ఎల్లప్ప, 19వ వార్డు కౌన్సిలర్‌ వెంకటేష్‌ జుంటుపల్లి, స్థానిక యువకులు అంజిలయ్య, శివ, సాయి ప్రసాద్‌, వినోద్‌కుమార్‌, కృష్ణ, యాదగిరి, వేణు తదితరులు కూడా సానుభూతి తెలిపారు.

ఇందిరానగర్‌లో ఘనంగా వినాయక ఉత్సవాలు