విశ్వకర్మ జయంతి ఉత్సవాలకు రండి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

విశ్వకర్మ జయంతి ఉత్సవాలకు రండి..!
– స్పీకర్, చీఫ్ విప్, ప్రముఖులకు ఆహ్వానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఈ నెల 17న తాండూర్‌లో నిర్వహించనున్న విశ్వకర్మ జయంతి వేడుకలకు హాజరుకావాలని కోరుతూ తాండూరు నియోజకవర్గ విశ్వకర్మ సంఘం ప్రతినిధులు పలువురు ప్రముఖులను కలిసి ఆహ్వానించారు.

శాసనసభ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌, మాజీ స్పీకర్‌ మధుసూదన్‌చారి, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, శాసనమండలి చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తదితరులను కలిసి కార్యక్రమానికి రావాలని ఆహ్వానపత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా విశ్వకర్మ సంఘం నాయకులు మాట్లాడుతూ.. విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి సంఘం సభ్యులు, విశ్వకర్మ సామాజిక వర్గానికి చెందిన వారు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

ఆహ్వానం అందజేసిన వారిలో కరణం పురుషోత్తంరావు, సంఘం ప్రతినిధులు పులిందర్‌చారి, గద్దె శ్రీనివాస్‌చారి, రవీందర్‌చారి, కందనెల్లి శ్రీనివాసచారి తదితరులు ఉన్నారు.

సాయిపూర్‌లో భక్తులకు అన్నప్రసాద వితరణ