తెలంగాణకు తుఫాను గండం
– రాగల 48 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం
– 15 జిల్లాలకు అలర్ట్‌ను ప్రకటించిన వాతావరణ శాఖ
హైదరాబాద్, దర్శని ప్రతినిధి : తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లను కుదిపేసిన తుపాను గండం తెలంగాణకు పొంచిఉందని హైదరాబాద్ వాతారవరణ శాఖ హెచ్చరిస్తోంది. రాగల 48 గంటల్లో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని 15 జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటన విడుదల చేసింది. జాగ్రత్తలు తీసుకోవాలని అలర్ట్‌ను జారీ
చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, తుఫాన్లు, పెనుగాలులు బీభత్సం సృష్టించగా, ముఖ్యంగా రాయలసీమలో డజనుకు పైగా ప్రజలు మరణించారు. వేలాది చోట్ల వరదలు, విద్యుత్ లైన్లు తెగిపోయాయి, రోడ్లు కొట్టుకుపోయాయి. అంతేకాకుండా భారీ వర్షం, వరదల కారణంగా 80 మందికి పైగా తప్పిపోయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా బంగాళఖాతంలో వాయుగుండం వార్పుల కారణంగా తెలంగాణకు తుఫాన్ గండం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని హైదరాబాద్, రంగారెడ్డి, మెడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.


