నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష
తాండూరు, దర్శిని ప్రతినిధి : వినాయక నిమజ్జనోత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సూచించారు.

గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు ఆర్డీఓ అనిత సమక్షంలో పోలీసులు, పలు శాఖల అధికారులు, హిందూ ఉత్సవ సమితి సభ్యులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమజ్జనోత్సవాల రూట్‌ మ్యాప్ గురించి అడిగి తెలుసుకున్నారు. నిమజ్జన ఉత్సవాలకు ఆయా శాఖల అధికారులు చేపట్టిన చర్యల వివరాలను ఆరా తీశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి యేడాది మాదిరిగానే వినాయక నిమజ్జన ఉత్సవాలకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించాలన్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. హిందూ ఉత్సవ సమితి సభ్యులు నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా బాధ్యత తీసుకోవాలన్నారు. సభ్యులు అందరు అధికారులకు, సమితి సభ్యులకు సహకరించాలన్నారు. అందరి సమన్వయంతో నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని అన్నారు. అనంతరం వికారాబాద్‌ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రాతో కలిసి కోకట్ వాగులో నిజ్జమన ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి, తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, సీఐ పరమేశ్వర్ గౌడ్, మార్కెట్ కమిటి చైర్మన్ వడ్డె శ్రీనివాస్, మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్,  హిందూ ఉత్సవ సమితి గౌరవాధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బిడ్కర్ రఘు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు, కౌన్సిలర్లు, నేతలు, వివిధ సమితిల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

దోచుకోవడమే కాంగ్రెస్ కుట్ర..!