విరాళదాతలకు ప్రసాదం పంపిణీ
– వినాయక ఉత్సవాలకు చేయూత మరువలేనిది
– ధన్యవాదాలు తెలిపిన హిందూ ఉత్సవ సమితి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో జరిగిన వినాయక చవితి ఉత్సవాలకు విరాళాలు, భారీ చందాలు అందించిన పెద్దలకు, ప్రముఖులకు, భక్తులకు హిందూ ఉత్సవ సమితి ప్రసాదాలను పంపిణీ చేసింది.

బుధవారం సమితి ప్రధాన కార్యదర్శి బిడ్కర్ రఘు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. తాండూరుకు చెందిన ప్రముఖ వైద్యులు డా.సంపత్ కుమార్, రియల్ ఏస్టేట్ వ్యాపారి సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత బావనోళ్ల శంకర్ యాదవ్‌తో పాటు పలువురు పెద్దల నివాసాలకు వెళ్లి ప్రసాదాలను పంపిణీ చేశారు.

తాండూరులో వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జనాలు బ్రహ్మండంగా నిర్వహించడంలో దాతలు అందించిన సహాకారం మరువలేదని సమితి సభ్యులు కొనియాడారు. ఇందుకు మనస్పూర్తిగా సహకరించినట్లు ధన్యవాదాలు తెలిపారు. ఇకముందు జరిగే ఉత్సవాలను హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అందరి సహకారంతో నిర్వహిస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాల్లో తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, హిందూ సమితి గౌరవాధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, ఉపాధ్యక్షులు అశిష్టికర్ అశీశ్, కోశాధికారి అంతారం కిరణ్, పర్యాద రామకృష్ణ, రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


