పరిసరాల పరిశుభ్రతో దోమల నివారణ
– తాండూరులో ప్రపంచ మలేరియా దినోత్సవం
– నర్సింగ్ కాలేజీ విద్యార్థులతో ర్యాలీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : పరిసరాల పరిశుభ్రతతోనే దోమల నివారణ సాధ్యమవుతుందని తాండూరు డిప్యూటీ డీఎం అండ్ హెచి డా.రవీంద్ర యాదవ్ అన్నారు. శుక్రవారం తాండూరులో ప్రపంచ మలేరియా దినోత్సవం జరుపుకున్నారు. సూపర్ వైజర్ సుదర్శన్, ఎస్ఓ ప్రకాష్ ఆధ్వర్యంలో తాండూరు నర్సింగ్ కాలేజీ విద్యార్థులతో కలిసి పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు = పరిసరాల పారిశుద్ధ్యం – మలేరియా నివారణకు మార్గం అంటూ నినాదాలు చేశారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన డా. రవీంద్ర యాదవ్ మాట్లాడుతూ దోమ కాటు వల్ల మలేరియా, డెంగ్యూ, పైలేరియా(బోధకాలు) తదితర వ్యాధులు సంక్రమిస్తాయన్నారు. దోమలు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలన్నారు. పరిసరాల పరిశుభ్రతోనే దోమల నివారణ సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అంబిక, రోజ్ మెర్రీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి….

