కార్మికుడైన కౌన్సిలర్‌..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కార్మికుడైన కౌన్సిలర్‌..!
– స్వయంగా చెత్త తొలగించిన వైనం
– శానిటేషన్‌ సిబ్బంది సహకరించడం లేదని ఆవేదన
– 23వ వార్డు బీజేపీ కౌన్సిలర్‌ అంతారం కిరణ్‌
తాండూరు, దర్శిని ప్రతినిధి: చెత్త తరలింపులో సిబ్బంది నిర్లక్ష్యం సహించలేక ఓ కౌన్సిలర్‌ స్వయంగా పారిశుద్ధ్య కార్మికుడిగా మారారు.

తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డు వాల్మీకి నగర్‌లో చెత్త, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించేందుకు బీజేపీ కౌన్సిలర్‌ అంతారం కిరణ్‌ స్వయంగా రంగంలోకి దిగి చెత్తను తొలగించారు. వార్డులో పారిశుద్ధ్య సమస్యలపై ప్రజల నుంచి తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని కిరణ్‌ తెలిపారు. సమస్యలను మున్సిపల్‌ శానిటేషన్‌ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా ఆశించిన స్థాయిలో సహకారం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తనపై ఉన్నందున సిబ్బంది కోసం వేచి ఉండకుండా తానే చెత్త, డ్రైనేజీ వ్యర్థాలను తొలగించినట్లు పేర్కొన్నారు.
అధికార పాలకవర్గం ప్రతిపక్ష బీజేపీ వార్డులో పక్షపాతం చూపిస్తుందని ఆరోపించారు.

ఇప్పటికైనా వార్డులో పారిశుద్ధ్యం, తాగునీరు, వీధిలైట్లు తదితర సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారంలో మున్సిపల్‌ సిబ్బంది సహకరిస్తే అభివృద్ధి పనులు మరింత వేగంగా చేపట్టేందుకు అవకాశం ఉంటుందని కిరణ్‌ అన్నారు.

ఇన్‌ఫ్లూఎంజా టీకా ఒక్కటి చాలు