చెలగాటానికి గుణపాఠం తప్పదు

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

చెలగాటానికి గుణపాఠం తప్పదు
– సర్కారు చేతగాని తనం వల్లే పేపర్ లీకేజీలు
– క్యాంపస్ ముట్టడి యూత్‌ కాంగ్రెస్ నేతల అరెస్టులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: విద్యార్థుల జీవితాలో చెలగాటం ఆడుతున్న తెలంగాణ సర్కారుకు గుణపాఠం తప్పదని యూత్‌ కాంగ్రెస్ నేతలు అన్నారు. టీఎస్‌పీఎస్సీ, పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీల నిర్లక్ష్యానికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుల ముట్టడికి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయమే పోలీసులు యూత్ కాంగ్రెస్‌ తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు బోయ అశోక్, ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్‌ కుమార్‌లను ముందస్తు అరెస్టులు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీసులతో బలప్రయోగాలు చేస్తూ అక్రమ అరెస్టులు చేయడాన్ని ఖండించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే టీఎస్‌పీఎస్సీ, పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీకేజీలు అయ్యాయన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం నిలదీయాల్సిన తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రశ్నించకపోవడం సిగ్గుచేటన్నారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు యూత్‌ కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందన్నారు. పోలీసులతో ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా పోరాటాలను అణిచి వేయలేరన్నారు. లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న తెలంగాణ సర్కారుకు రానున్న రోజుల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.