పట్టభద్రుల ఓటు తప్పక నమోదు చేసుకోవాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

పట్టభద్రుల ఓటు తప్పక నమోదు చేసుకోవాలి
– నవంబర్‌ 6లోగా ఫారం–18తో అవకాశం
– కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్
తాండూరు, దర్శిని ప్రతినిధి : మహబూబ్‌నగర్‌–రంగారెడ్డి–హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అర్హులైన పట్టభద్రులు కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలని కాంగ్రెస్‌ వికారాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్‌ కుమార్ కోరారు.

2023 నవంబర్‌ 1 కంటే ముందు డిగ్రీ పూర్తి చేసిన ప్రతి అర్హత కలిగిన పట్టభద్రుడు ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గతంలో పట్టభద్రుల ఓటు ఉన్నప్పటికీ ప్రస్తుత ఎన్నికల కోసం మరోసారి ఫారం–18 ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

నవంబర్‌ 6 చివరి తేదీ కావడంతో అర్హులు గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. విద్యార్హత ధ్రువీకరణ పత్రం, ఆధార్‌, ఓటర్‌ ఐడీ, ఫొటో, గెజిటెడ్‌ అధికారి ధ్రువీకరణ పత్రం తదితరాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీ మేరకు సుమారు 60 వేల ఉద్యోగాల భర్తీ చేపట్టిందని సంతోష్‌ తెలిపారు. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్‌మేళా ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని, నిరుద్యోగులకు ఉచిత శిక్షణ కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి పట్టభద్రుడు ఓటు నమోదు చేసుకుని తన ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్‌రెడ్డికి మద్దతుగా నిలవాలని కోరారు.

పేదల దాహార్తి తీర్చిన దాతృత్వం