పేదల దాహార్తి తీర్చిన దాతృత్వం
– బుడగ జంగం కాలనీలో బోరు
– ఏర్పాటుకు డాక్టర్ సంపత్‌కుమార్ సహకారం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని 2వ వార్డు బుడగ జంగం కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్‌కుమార్ ఆర్థిక సహకారం అందించారు.

ఆయన సహకారంతో శనివారం కాలనీలో బోరు ఏర్పాటు చేశారు. కాలనీలో కొంతకాలంగా తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని మోడెం కృష్ణ డాక్టర్ సంపత్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించి బోరు ఏర్పాటుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించారు.

దీంతో బోరు పనులు చేపట్టి నీటి సమస్యకు పరిష్కారం చూపారు.తాగునీటి ఇబ్బందిని గుర్తించి సహకారం అందించిన డాక్టర్ సంపత్‌కుమార్‌కు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. పేదల అవసరాలకు స్పందిస్తూ సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ప్రజా సంఘం తాండూర్ డివిజన్ కార్యదర్శి బుడగ జంగం వెంకటేష్, సీనియర్ రిపోర్టర్ లక్ష్మణ్, రమేష్, మోడెం కృష్ణ, మోడెం దత్తు, మోడెం రమేష్, రుద్రాక్షల దస్తప్ప, రుద్రాక్షల బాబు, వాన రాసి శేఖర్, శాంతికుమార్, అంజిలప్ప తదితరులు పాల్గొన్నారు.


