తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ పండగ

తాండూరు రాజకీయం వికారాబాద్

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ పండగ
– మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి
– ఎస్టీ హాస్టల్‌లో బతుకమ్మ సంబరాల జోష్‌
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండగ ప్రతీకగా నిలుస్తుందని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి అన్నారు.

తాండూరు ఎస్టీ హాస్టల్‌లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొని విద్యార్థినులతో కలిసి బతుకమ్మ సంబరాల్లో సందడి చేశారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ బతుకమ్మ పండగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతను, ప్రకృతితో మనకున్న అనుబంధాన్ని చాటుతుందన్నారు.

విద్యార్థినులు మన సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకుని వాటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. హాస్టల్‌ విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి పాటలు పాడుతూ, సంప్రదాయ నృత్యాలతో ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు.

. చైర్‌పర్సన్‌ నీరజా బాల్‌రెడ్డితో పాటు హాస్టల్‌ వార్డెన్‌ భాగ్యలక్ష్మి, విద్యార్థినులు పాల్గొని బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు నంబర్‌ 10 కౌన్సిలర్‌ అల్లాపూర్‌ శ్రీకాంత్‌, హాస్టల్‌ సిబ్బంది, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

భళా.. బచ్ పన్ సేవా..!