ప్రతి ఒక్కరు బాధ్యతగా పనిచేయాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

ప్రతి ఒక్కరు బాధ్యతగా పనిచేయాలి
– పారిశుద్ధ్యం, తాగునీరుపై ప్రత్యేక శ్రద్ధ
– తాగునీరు, డ్రైనేజీలపై ప్రణాళికలు అందించండి
– త్వరలోనే వార్డు కార్యాలయాల ప్రారంభం
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు బాధ్యతగా పనిచేయాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి అధ్యక్షతన అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులుతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరై పట్టణంలో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలు, కావాల్సిన అభివృద్ధిపై సమీక్షా ఆరా తీశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులు అందరికి అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుత వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. పట్టణంలో మిషన్ భగీరథ నీటి సరఫరా, లీకేజీలపై దృష్టిసారించాలన్నారు. పట్టణంలోని కాలేజీ మైదానంలో తాగునీటీ లీకేజీపై చర్చించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా ప్రోత్సహించాలన్నారు. పట్టణంలోని 20, 21, 23వ వార్డులలో తాగునీటి సమస్యతో పాటు డ్రైనేజీ వ్యవస్థకు ప్రణాళికలు సిద్ధం చె యాలన్నారు. ఇప్పటికే ఎస్టీఎఫ్ నుంచి నిధులు కేటాయించడం జరిగిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత వార్డు ఆఫీసర్లను నియమించడం జరిగిందని, వార్డు ఆఫీసర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

వార్డులలో మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి పనిచేయాలన్నారు. ప్రభుత్వ పథకాలు గ్యాస్ సిలిండర్ పై సబ్సీడీ, గృహ జ్యోతి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. త్వరలోనే వార్డు కార్యాలయాలను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు. నాయకులు అబ్దుల్ రవూఫ్, మాజీ వైస్ చైర్మన్ సాజిద్ అలీ. మాజీ కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, అబ్దుల్ రజాక్, ప్రభాకర్ గౌడ్, బోయరవి, సోమశేఖర్, ప్రవీన్ గౌడ్, లింగదలి రవికుమార్, మమత, పార్టీ నాయకులు, వార్డు ఆఫీసర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి….

గర్భంలో శిశువు మృతి