తాండూరు గౌడ్‌లకు తోడ్పాటు అందించండి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు గౌడ్‌లకు తోడ్పాటు అందించండి..!
– ఎక్సైజ్ సీఐని కలిసిన సోసైటీ మాజీ చైర్మన్ హరిహర గౌడ్
– ఈ కలయిక సోసైటీ రాజకీయాలపై చర్చనీయాంశం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని గౌడ్‌లకు తోడ్పాటు అందించాలని స్థానిక ఎక్సైజ్‌ సీఐ సాయన్నను కల్లుగీత కార్మిక సోసైటీ మాజీ చైర్మన్ హరిహరగౌడ్ కోరారు.

శనివారం తాండూరు ఎక్సైజ్ కార్యాలయంలో సీఐ సాయన్నను హరిహరగౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాండూరులోని గౌడ కులస్తులకు తోడ్పాటు అందించాలని కోరారు. వ్యాపారులకు ఇబ్బందులు రాకుండా చూడాలని కోరారు. సీఐని కలిసిన సమయంలో సోసైటీ సభ్యులు నరేష్‌ కూడా ఉన్నారు.

మరోవైపు మాజీ చైర్మన్ హరిహర గౌడ్ సీఐని కలవడం వెనక సోసైటీ రాజకీయాలలో చర్చనీయాంశమైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత సోసైటీ సభ్యులు తాండూరులోని గౌడ్‌లకు అందించాల్సిన ప్రోత్సాహాంలో అవతవకలకు పాల్పడినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

త్వరలో కల్లు సోసైటీలో తీవ్ర పరిణామాలు జరిగేలా పరిస్థితులు ఏర్పడినట్లు సోసైటీ సభ్యులు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హరిహర్ గౌడ్ ఎక్సైజ్‌ సీఐని కలిసినట్లు చర్చకు దారితీసినట్లు తెలుస్తోంది.

జీవో 25 సవరించాలి..!