ఫించన్ అర్హులకూ అన్యాయం జరగొద్దు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఫించన్ అర్హులకూ అన్యాయం జరగొద్దు..!
– గాంధీనగర్‌లో 40 దరఖాస్తులు.. 31 మందికి మంజూరు
– మిగతా వారికి అందేలా చూడాలి
– వార్డు నంబర్ 20 కౌన్సిలర్ నవీన సంతోష్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ పరిధి గాంధీనగర్‌లో అర్హులైన చేయూత లబ్ధిదారులకు అన్యాయం జరగకుండా చూడాలని వార్డు నంబర్ 20 కౌన్సిలర్ నవీన సంతోష్ గౌడ్ కోరారు.

సోమవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో గాంధీనగర్‌కు చెందిన 31 మంది లబ్ధిదారులకు పింఛన్లు అందించినట్లు తెలిపారు. గాంధీనగర్ నుంచి మొత్తం 40 మంది కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోగా, వారిలో 31 మందికి మాత్రమే మంజూరు లభించిందని పేర్కొన్నారు.

మిగిలిన తొమ్మిది మంది కూడా అర్హులేనని, వారికి సైతం పింఛన్లు మంజూరు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందాలని ఆకాంక్షించారు.

గాంధీనగర్‌లో ఏ సమస్య ఎదురైనా వెంటనే స్పందించి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని నవీన సంతోష్ గౌడ్ తెలిపారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రజలకు చేరేలా నిరంతరం పనిచేస్తామని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు.

ఇంట్లోనే డ్రైవింగ్‌ లైసెన్స్‌ పరీక్ష..!