కాంగ్రెస్ హామీలన్నీ ‘420’ మాటలే..!
– చేయూత, ఇందిరమ్మ బీమా అమలు ఉట్టిమాటలే
– ప్రకటనలు, శంకుస్థాపనలతోనే కాలక్షేపం
– బీఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వ హామీలు, ప్రకటనలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని, ఆచరణలో ఏమీ లేదని బీఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్ విమర్శించారు.

గురువారం ఓ ప్రకటనలో మాట్లాడుతూ ఇందిరమ్మ చేయూత కింద పెన్షన్ ప్రొసీడింగ్లు అందజేత కార్యక్రమంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ 19వ తేదీన ఖాతాల్లో పెన్షన్ డబ్బులు జమ అవుతాయని, రెండు రంగుల చీరలు వస్తాయని, అలాగే బీమా పథకం ఇంటింటికీ వచ్చి అందిస్తామని గొప్పగా చెప్పారని జావిద్ గుర్తు చేశారు.

అయితే 19వ తేదీ వచ్చినా ఇంతవరకు ఏ ఒక్క హామీ అమలు కాలేదని ఆరోపించారు. ప్రొసీడింగ్లు, పత్రికా ప్రకటనలు, శంకుస్థాపనలు, నిధుల ప్రచారంతోనే కాలం గడుపుతున్నారని, అభివృద్ధి విషయంలో ఏమీ జరగడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి ప్రకటనలు, ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఇచ్చిన హామీలు కూడా నమ్మశక్యంగా లేవని, అవి ‘420’ హామీల్లాగే, ‘420’ మాటలుగా మిగిలిపోయాయని విమర్శించారు.

అభివృద్ధిని పక్కన పెట్టి అధికార పార్టీ నేతలు పరస్పర విమర్శలు, ఫ్లెక్సీలపై ఫోటోలు లేవంటూ గొడవలతో సమయం వృథా చేస్తున్నారని అన్నారు. ప్రజలు ఈ మోసపూరిత మాటలను గమనించాలని ఆయన కోరారు.


