రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎస్‌సీఆర్‌ఎంయూ కృషి

తాండూరు రాజకీయం వికారాబాద్

రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎస్‌సీఆర్‌ఎంయూ కృషి
– సికింద్రబాద్‌ డివిజన్‌ కార్యదర్శి పి. రవీందర్‌
– తాండూరులోని ఉద్యోగుల సమస్యలపై ఆరా
తాండూరు, దర్శిని ప్రతినిధి : రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎస్‌సీఆర్‌ఎంయూ నాయకులు కృషి చేస్తున్నారని ఆ యూనియన్‌ సికింద్రాబాద్‌ డివిజినల్ సెక్రటరీ పి. రవీందర్‌ తెలిపారు.

ఈ క్రమంలో సికింద్రాబాద్‌ నుంచి తాండూరు వచ్చిన ఆయన స్థానిక ఎస్‌సీఆర్‌ఎంయూ కార్యాలయంలో తాండూరు బ్రాంచ్ సెక్రటరీ పి.కాలేశ్వర్ ఆధ్వర్యంలో స్థానిక రైల్వే ఉద్యోగులతో సమావేశమయ్యారు. లోకో పైలట్లు, గార్డులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ఇంజనీరింగ్‌, ఆపరేటింగ్‌, టీఆర్‌డీ తదితర విభాగాల కార్మికుల ఇబ్బందులపై చర్చించారు.

ఈ సందర్భంగా పలువురు కార్మికులు తమ సమస్యలను వివరించి వినతిపత్రాలు అందజేశారు. ఉద్యోగులపై పని భారం, ఒత్తిడి పెరగకుండా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారానికి యూనియన్ అండగా నిలుస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్‌ డివిజన్‌ అసిస్టెంట్‌ డివిజనల్‌ సెక్రటరీ ఢిల్లీ రావు, తాండూరు బ్రాంచ్‌ చైర్మన్‌ శ్యామ్‌ చవాన్‌, వైస్‌ చైర్మన్‌ లోకానందం, ఎల్‌పీ అశోక్‌ గౌడ్‌, చంద్రశేఖర్‌, భరత్‌, సీ. రాజు, ప్రకాష్‌, దేశరాజు, వెంకటప్ప, మోహన్‌, మనోజ్‌, బుగ్గయ్యతో పాటు యూనియన్‌ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ బీమాతో పేద కుటుంబాలకు ధీమా!